![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -999 లో.. వసుధార కాలేజీకీ రెడీ అయి బయలుదేరబోతుంటే డబ్బులు అడ్జస్ట్ అయ్యాయా అని మహేంద్ర అడుగుతాడు. లేదు మావయ్య అని వసుధార చెప్తుంది. ఇప్పటికైన మనం ఎక్కడికైనా వెళ్లిపోదామమ్మా అని మహేంద్ర అనగానే.. లేదు మావయ్య నాకు ఇంకా నమ్మకం ఉందని వసుధార అంటుంది. ఇది రిషి సర్ బ్రాస్ లైట్ నా దగ్గర ఉందంటే రిషి సర్ నాతోనే ఉన్నట్లు.. ఎట్టి పరిస్థితిలోను కాలేజీని చెయ్యి జారనివ్వనని వసుధార అంటుంది.
ఆ తర్వాత వసుధార మాటలకి మహేంద్ర, అనుపమ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత శైలేంద్ర సూట్ వేసుకొని రెడీ అయి వచ్చి.. మమ్మీ ఎలా ఉన్నానంటు దేవాయనిని అడుగుతాడు. బాగుందని దేవయాని చెప్తుంది. అప్పుడే ధరణి వచ్చి.. నేను అన్నదే జరుగుతుందని చెప్తుంది. ఈ రోజు ఎలాగైనా ఎండీ చైర్ నాదే అని శైలేంద్ర అంటాడు. మనసులో అంత మంచి జరగాలని కోరుకుంటూ నువ్వు ఎదురు రా అని ధరణితో శైలేంద్ర అంటాడు. ధరణి సరే అంటూ శైలేంద్రకి ఎదురు వస్తుంది. ఆ తర్వాత శైలేంద్ర కాలేజీకి వెళ్లి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. రిషి మన కాలేజీనీ తాకట్టు పెట్టి డబ్బులు తెచుకున్నాడంట.. ఇప్పుడు వాళ్ళు కాలేజీ ఇవ్వమని అడుగుతున్నారు. మా పరిస్థితి ఏంటని వసుధారా వచ్చాక గట్టిగా అడగండని శైలేంద్ర చెప్తాడు.. ఆ తర్వాత వసుధార రాగానే కాలేజీ ఎవరో చేతిలోకీ వెళ్తే మా పరిస్థితి ఏంటని స్టూడెంట్స్ అడుగుతారు. మీరు కాలేజీ గురించి ఏం టెన్షన్ పడకండి.. ముఖ్యంగా ఎవరి మాటలు నమ్మొద్దు.. మీరు స్టడీపై దృష్టి పెట్టండి అని వాళ్ళని అక్కడి నుండి పంపిస్తుంది వసుధార.
ఆ తర్వాత కాలేజీని నీ చేతిలోకి మాత్రం రానివ్వనని శైలేంద్రతో వసుధార అంటుంది. ఆ తర్వాత అందరు బోర్డు మెంబర్స్, ఫైనాన్సియర్స్ వచ్చి ఇరవై నాలుగు గంటలు సమయం అడిగారు. డబ్బులు ఇస్తున్నారా కాలేజీ ఇస్తున్నారా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడే మినిస్టర్ వస్తాడు. వాళ్లకి కొంచెం టైమ్ ఇవ్వండి వాళ్ళు కాలేజీనీ వదులుకోలేరని మినిస్టర్ అంటాడు. అప్పుడే ఒకతను కార్ లో వస్తాడు. అతన్ని రాజీవ్ చూసి వీడెందుకు ఇప్పుడు వస్తున్నాడని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |